సుజాత కోసం రాకేష్ చేసిన పని తెలుసా?
on Aug 20, 2022
రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత వీళ్లిద్దరి గురించి బుల్లితెర ఆడియన్స్ కి బాగా తెలుసు. జబర్దస్త్ లో పుట్టిన ప్రేమలో వీళ్లది కూడా ఒక జంట. ఇక ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ రాకేష్ సుజాత కోసం ఎవరూ చేయని పని చేసాడు. కమలహాసన్ నటించిన భామనే సత్యభామని సినిమాలో భార్య కోసం అమ్మాయి గెటప్ వేసిన కమలహాసన్ లా ఇక్కడ ఒక స్కిట్ లో సుజాత కోసం అమ్మాయి గెటప్ వేస్తాడు రాకింగ్ రాకేష్. సుజాతను రాకేష్ హింసిస్తున్నాడని సుజాతని వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకొచ్చేస్తుంది.కానీ రాకేష్ మాత్రం సుజాతని కలవాలి చూడాలి అంటూ అమ్మాయి గెటప్ వేసుకుని ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ అత్తగారి ఇంట్లో ముగ్గులు వేయడం, కాళ్ళు పట్టడం ఇంటి పనులన్నీ చేయడం చేస్తాడు.
అదే టైంకి పటాస్ ప్రవీణ్ సుజాత తమ్ముడిగా ఇంటికి వస్తాడు. ప్రవీణ్ వేసే డైలాగ్స్ కి ఇంద్రజ పడీ పడీ నవ్వుతుంది. రాకేష్ ముగ్గు వేసేటప్పుడు ప్రవీణ్ వచ్చి హే నన్ను ముగ్గులోకి దించడానికి ముగ్గు వేస్తున్నావా..నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ రాకేష్ వెంటపడేసరికి నేను పనిమినిషినండి అంటాడు. మన మనుషులు దూరమైనప్పుడే పని మనుషులు దగ్గరౌతారు అంటాడు ప్రవీణ్. అమ్మ నాకు త్వరగా పెళ్లి చెయ్యి ..హార్మోన్స్ హార్మోనియం వాయిస్తున్నాయి అంటూ వెరైటీ డైలాగ్స్ తో ప్రవీణ్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు.